Salaar: Part 1 : సలార్ సినిమా కంటెంట్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

|

Nov 20, 2023 | 3:50 PM

కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ లో ఉండేలా తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సాలార్ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సలార్ మూవీ నుంచి కొన్ని లీక్ లు చిత్రయూనిట్ ను టెన్షన్ లో పడేశాయి.

Salaar: Part 1 : సలార్ సినిమా కంటెంట్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Salaar
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ సలార్. ఈ సినిమా కోసం  డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ లో ఉండేలా తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సాలార్ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సలార్ మూవీ నుంచి కొన్ని లీక్ లు చిత్రయూనిట్ ను టెన్షన్ లో పడేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీక్స్ మాత్రం ఆగడం లేదు.

కొద్దిరోజుల క్రితం సలార్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ తర్వాత స్టోరీ ఇదే అటు కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. దాంతో మేకర్స్ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా సైబర్ క్రైం పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో సలార్ మూవీ స్టోరీని స్ప్రెడ్ చేస్తున్నారని ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. సలార్ మూవీ కంటెంట్ ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొంతమంది కావాలని ఇష్టమొచ్చినట్టు సలార్ కంటెంట్ ను యూట్యూబ్ ఛానెల్స్ లో రివీల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్ సీరియస్ వార్ నింగ్ ఇచ్చినా కుండా కొంతమంది సలార్ కంటెంట్ ను లీక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాలిడ్ హిట్ అందుకోలేక పోయాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాను ఆడియన్స్ ను నిరాశపరిచాయి. దాంతో సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..