AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cv Anand: తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..

నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో వచ్చిన ఎమోజీ రిప్లైకి సంబంధించిన వివాదంపై హోం స్పెషల్ సెక్రటరీ సీవీ అనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్టును తాను చేయలేదని, సోషల్ మీడియాను చూసే హ్యాండ్లర్ రెండు నెలల క్రితం తనకు తెలియకుండా పెట్టాడని చెప్పారు.

Cv Anand: తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..
Balayya - CV Anand
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 17, 2025 | 3:08 PM

Share

సెప్టెంబర్ నెలలో సీవీ ఆనంద్ హైదరాబాద్  ఉన్న సమయంలో సిటీ పోలీసులు అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఆ సమయంలో తెలుగు చిత్రరంగ ప్రముఖులతో ఓ మీటింగ్ నిర్వాహించారు. ఈ సమావేశానికి బాలయ్య తప్ప అగ్ర హీరోలు అందరూ హాజరయ్యారు. పైరసీకి ఎలా చెక్ పెట్టాలి, టాలీవుడ్-పోలీసుల మధ్య సమన్వయంతో పని చేయడంపై లోతైన చర్చ జరిగింది. ఈ మీటింగ్‌కు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఓ నెటిజన్.. బాలయ్యను కూడా మీటింగ్‌కు పిలవండి.. లేదంటే ఆయన అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు అని కామెంట్ పెట్టాడు.  కామెంట్‌కి సీవీ ఆనంద్ ఖాతా నుంచి స్మైలీ ఎమోజీ పెట్టారు. ఆ ఎమోజీపై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. టాలీవుడ్ పిల్లర్,  మూడుసార్లు ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయిన బాలకృష్ణ గురించి ఇలా స్పందించడంపై ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈ వివాదం రెండు నెలలుగా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉండగా.. తాజాగా సీవీ ఆనంద్ స్పష్టత ఇచ్చారు.

అది తన సోషల్ మీడియా ఖాతాలు చూసే వ్యక్తి తెలియక పెట్టాడని.. అది తన నాలెడ్జ్‌లో లేకుండా చేసిన పని అని, ఈ విషయాన్ని తాను వెంటనే తెలుసుకోలేకపోయానని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే.. ఆ పోస్ట్ డిలీట్ చేసి.. పూర్తి వివరాలు వాకబు చేసినట్లు పేర్కొన్నారు. బాలకృష్ణతో తనకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నందున పర్సనల్ మెసెజ్ ద్వారా సారీ చెప్పినట్లు వెల్లడించారు. తనకు అగ్ర నటులు అందరిపై గౌరవం ఉందని చెప్పారు. ఆ రిప్లై ఇచ్చిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌లను తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇక్కడితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!