ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై పై ఇక‌నుంచి కొర‌డా….

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 5:36 PM

హీరో విజయ్ దేవరకొండ తెలుగులో కొన్ని వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిప‌డ్డాడు. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై మాట్లాడిన తరువాత చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు. తెలుగు […]

ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై పై ఇక‌నుంచి కొర‌డా....
Follow us on

హీరో విజయ్ దేవరకొండ తెలుగులో కొన్ని వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిప‌డ్డాడు. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై మాట్లాడిన తరువాత చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫేక్ న్యూస్, ఫేక్ వెబ్సైట్స్ ను ఖండిస్తోంది. అసత్యంగా వార్తలు రాసే వెబ్ సైట్స్ ను వ్యతిరేకిస్తోంది. హీరోలు దర్శకులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ చెయ్యడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తుంది. ఒక మనిషి తన స్థోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు, దానిపై కూడా కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. సినిమా యాడ్స్ వలన రెవిన్యూ పొందుతూ ఇలా సినిమా వారిపైన ఓ వెబ్‌సైట్ నెగుటీవ్ ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు, ఈ విషయం పై లాక్ డౌన్ పూర్తి తరువాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, ఎవరికైనా ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్స్ పైన ఫిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది.