Pawan Kalyan: ఇది క్రేజ్ అంటే..! పవన్ కళ్యాణ్ కాదు.. పవర్ స్టార్ అనాలి.. తెలుగు యాంకర్‌కు కౌంటర్ ఇచ్చిన స్టార్ క్రికెటర్

పవర్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగొచ్చినట్టే.. థియేటర్స్ దద్దరిల్లాల.. సోషల్ మీడియా షేక్ అవ్వాలా.. అంతా సందడి చేస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. త్వరలో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. ఇప్పటికే సభలతో అక్కడ హోరెత్తిస్తున్నారు. అలాగే గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

Pawan Kalyan: ఇది క్రేజ్ అంటే..! పవన్ కళ్యాణ్ కాదు.. పవర్ స్టార్ అనాలి.. తెలుగు యాంకర్‌కు కౌంటర్ ఇచ్చిన స్టార్ క్రికెటర్
Pawan Kalyan

Updated on: Feb 09, 2024 | 1:49 PM

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఆయన సినిమా రిలీజ్ అయితే జాతరే..పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగొచ్చినట్టే.. థియేటర్స్ దద్దరిల్లాల.. సోషల్ మీడియా షేక్ అవ్వాలా.. అంతా సందడి చేస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. త్వరలో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. ఇప్పటికే సభలతో అక్కడ హోరెత్తిస్తున్నారు. అలాగే గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. పవన్ ఇప్పటికే చాలా సినిమాలను లైనప్ చేశారు. చివరిగా బ్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదిలా ఉంటే సామాన్యులే కాదు సెలబ్రెటీలలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలు, క్రేజీ హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. దాంతో పవన్ అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ కూడా పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు ఇర్ఫాన్ పఠాన్.

ఈ మాజీ టీమిండియా క్రికెటర్ ఇప్పటికే విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. తాజాగా ఓ స్టేజ్ పై యాంకర్ పవన్ కళ్యాణ్ అని అనడంతో వెంటనే ఇర్ఫాన్ పవన్ కళ్యాణ్ కాదు.. ఆయన్ను ఏమంటారో తెలుసాగా అన్నారు.. వెంటనే యాంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని గట్టిగా అరిచింది. దాంతో ఎస్.. గబ్బర్ సింగ్ అని అన్నారు ఇర్ఫాన్ పఠాన్. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఇర్ఫాన్ పఠాన్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.