Court Movie: నాని ‘కోర్టు’కు ఊహించని రెస్పాన్స్.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న మరో తెలుగు సినిమా

|

Mar 25, 2025 | 12:04 PM

కథలో కంటెంట్‌ ఉంటే చాలు చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా సినిమాలను అందలం ఎక్కిస్తున్నారు ప్రేక్షకులు. పెద్ద స్టార్ వందల కోట్లతో మువీ తీసినా కథలో కంటెంట్‌ లేకుంటే పక్కన పెట్టేస్తున్నారు. అదే ఊపొచ్చే క‌థ‌తో చిన్న హీరోలు సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అలాంటిదే మార్చి 14న విడుదలైన చిన్న మువీ కోర్టు..

Court Movie: నాని కోర్టుకు ఊహించని రెస్పాన్స్.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న మరో తెలుగు సినిమా
Court Movie
Follow us on

సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెద్ద స్టార్ వందల కోట్లతో మువీ తీసినా కథలో కంటెంట్‌ లేకుంటే పక్కన పెట్టేస్తున్నారు. అదే ఊపొచ్చే క‌థ‌తో చిన్న హీరోలు సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అలాంటిదే మార్చి 14న విడుదలైన చిన్న మువీ కోర్టు. నేచురల్ స్టార్‌ హీరో నాని నిర్మాణంలో.. రామ్‌ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఈ మువీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన కోర్టు మువీ ఊహించని విధంగా పెద్ద హిట్ కొట్టింది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మువీ కేవలం పది రోజుల్లోనే రికార్డు వసూళ్లూ రాబట్టింది. ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ‘గొప్ప సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకుల హిస్టారికల్ తీర్పు’ అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇదొక హిస్టారిక్‌ జడ్జిమెంట్‌ అని పేర్కొంది. కేవలం రూ.9 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ మునుముందు రోజుల్లో భారీగానే లాభాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. కాగా కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. శ్రీదేవి, రోషన్ జంటగా నటించి తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్‌ నటులు తమ ఫర్మామెన్స్‌తో తమ పాత్రలకు జీవం పోశారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా మువీలో విలన్‌ రోల్‌లో మంగపతిగా నటించిన శివాజీకి మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. పాత‌కేళ్ల త‌ర్వాత త‌న‌కి కరెక్ట్ రోల్ ప‌డిందిని స‌క్సెస్ ఈవెంట్‌లో శివాజీ చాలా ఎమోష‌న‌ల్‌ అయ్యాడు. ఇండస్ట్రీకి మరో విలన్‌ దొరికారని నెటిజన్లు సైతం మాట్లాడుకున్నారు. ఇక లాయర్‌గా ప్రియదర్శి కోర్టులో వాదించిన తీరు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ మువీ ఓటీటీలోకి రానుంది. కథ విషయానికొస్తే.. 2013 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందే చందు అనే కుర్రాడికి పెద్దింటి అమ్మాయి జాబిలికి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ విష‌యం కాస్త యువతి ఇంట్లో తెలియడంతో బంధువు మంగ‌ప‌తి కోపంతో వెన‌కా ముందు ఆలోచించ‌కుండా ఏ తప్పుచేయడని చందుపై పోక్సో చట్టంతోపాటు, ఇత‌ర క‌ఠిన‌మైన సెక్షన్ల కింద కేసు పెడ‌తాడు. దీంతో చందు చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.