క‌రోనాపై పోరాటానికి మ‌రో రూ. 3 కోట్ల విరాళం…ఎంత గొప్ప మ‌న‌స‌య్యా నీది..

క‌రోనాపై పోరాటానికి మ‌రో రూ. 3 కోట్ల విరాళం...ఎంత గొప్ప మ‌న‌స‌య్యా నీది..

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం ప్ర‌క‌టిస్తున్నారు. వీరిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. అత‌డు ఇప్ప‌టికే.. పీఎం కేర్స్ ఫండ్ కు మన దేశంలోనే ఏ హీరో ఇవ్వలేనంతగా ఏకంగా రూ. 25 కోట్ల భారీ డోనేష‌న్ ప్ర‌క‌టించి త‌న మ‌న‌సు ఎంత గొప్ప‌దో చాటుకున్నాడు. త‌ను చాలా కింద‌ నుంచి ప్రారంభమ‌య్యాన‌ని..ఇంత ఇచ్చిన ప్ర‌జ‌ల కోసం ఏం చేసేందుకైనా అక్ష‌య్ సిద్ద‌మ‌న్న‌ట్టు ఆయన వైఫ్ ట్వింకిల్ […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 8:17 AM

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం ప్ర‌క‌టిస్తున్నారు. వీరిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. అత‌డు ఇప్ప‌టికే.. పీఎం కేర్స్ ఫండ్ కు మన దేశంలోనే ఏ హీరో ఇవ్వలేనంతగా ఏకంగా రూ. 25 కోట్ల భారీ డోనేష‌న్ ప్ర‌క‌టించి త‌న మ‌న‌సు ఎంత గొప్ప‌దో చాటుకున్నాడు. త‌ను చాలా కింద‌ నుంచి ప్రారంభమ‌య్యాన‌ని..ఇంత ఇచ్చిన ప్ర‌జ‌ల కోసం ఏం చేసేందుకైనా అక్ష‌య్ సిద్ద‌మ‌న్న‌ట్టు ఆయన వైఫ్ ట్వింకిల్ ఖ‌న్నా ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా అక్షయ్ మరోసారి భారీ డోనేష‌న్ ప్ర‌క‌టించి త‌న స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు.ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 3 కోట్ల భారీ విరాళం అనౌన్స్ చేశాడు. ఈ డొనేష‌న్ మున్సిపల్ కార్మికులకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసంఅందజేయనున్నట్టు అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు. ఈ డబ్బుతో కలిపి అక్ష‌య్ కుమార్.. మొత్తం రూ. 28 కోట్ల విరాళాన్నిఇచ్చిన‌ట్లు అవుతోంది. ఇప్పుడు అర్థ‌మైందా బ్ర‌ద‌ర్ నిజ‌మైన హీరో. హ్యాట్సాఫ్ అక్ష‌య్ కుమార్.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu