ఇండస్ట్రీ మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చింది. అన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. ఎవ్రీ వీక్ రిలీజ్‌ల నెంబర్ కూడా పెరుగుతోంది. నెక్ట్స్ సీజన్‌లో అన్ని ఇండస్ట్రీలో బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. సరిగ్గా ఇప్పుడే టైమ్ చూసి మరోసారి ఎటాక్ చేస్తోంది కరోనా.
ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల హై ఎలర్ట్ ప్రకటించారు. ఇతర దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద పడుతుందేమో అన్న టెన్షన్‌లో ఉన్నారు మేకర్స్.
మిగిలిన ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే.. డిసెంబర్ నుంచి టాలీవుడ్‌లో భారీ చిత్రాల సందడి మొదలవుతోంది. ప్రతీ వారం ఒక బిగ్ మూవీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతోంది. ఆల్రెడీ ఆ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీస్ కూడాఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి.
జనవరిలో అయితే వెండితెర మీద మెగా యుద్ధమే జరగనుంది. ట్రిపులార్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు.. భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ లోగా కొత్త వేరియంట్ విజృంభిస్తే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న.
ఆల్రెడీ ఈ సినిమాల జెట్ స్పీడుతో జరుగుతోంది. టీజర్స్‌తో పాటు సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ కరోనా కారణంగా విడుదల ఆలస్యమైతే.. ఆ ప్రమోషన్ అంతా వేస్ట్ అయినట్టే.. మళ్లీ కొత్తగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అలా చేసిన ఇప్పుడున్నంత హైప్ వస్తుందా అన్నది అనుమానమే.. అందుకే థర్డ్ వేరియంట్ విషయంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో తెగ టెన్షన్ పడిపోతోంది.
–Sathish, ET, TV9
Also Read: RRR: ఐటెం సాంగ్ ఉందా మావా ?.. నెటిజన్ ప్రశ్నకు కౌంటరిచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.