
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్వీటర్ ఖాతా నుంచి తప్పుకున్నారు. ఏకంగా తన కుటుంబాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా బెదిరిస్తున్నారని తెలిపారు. అందుకే ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం దేశంలో దొంగల పాలన నడుస్తోంది. మనమంతా దీనికే అలవాటు పడ్డాం, ఈ ఆధునిక భారతంలో మీరంతా బతకగలుగుతారని నమ్ముతున్నాను. నిర్భయంగా నా అభిప్రాయాన్ని వెల్లడించలేనప్పుడు..నేను మౌనంగా ఉండటమే మంచిది.. నా తల్లిని, కుమార్తెను కూడా వేధిస్తున్నారు. ఇదే నా చివరి ట్వీట్ .. నేను ట్వీట్టర్ నుంచి వైదొలగుతున్నాను.. గుడ్‌బై అని పేర్కొన్నారు.
#AnuragKashyap we stand by you sir pic.twitter.com/tCg8m7BLYf
— Nazi (@Raahul1995) August 11, 2019