Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులను ఆశ్రయించిన అపార్ట్‏మెంట్ వాసులు..

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులను ఆశ్రయించిన అపార్ట్‏మెంట్ వాసులు..
Niharika Konidela

Updated on: Aug 05, 2021 | 7:53 AM

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు ఏర్పుర్చుకుంది. యాంకరింగ్‏తో కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక హీరోయిన్‏గానూ వెండితెరపై తన సత్తా చాటింది. అటు హీరోయిన్‏గా పలు సినిమాల్లో నటిస్తున్ సమయంలోనే నిహారికకు గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు.. వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఇటీవల డిసెంబర్‏లో ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిపించారు. ఇక వివాహం తర్వాత నిహారిక తన భర్త చైతన్యతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే. వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలతోపాటు.. ఆ మద్య మాల్దీవులు, ఇటీవల పాండిచ్చెరి వరకు టూర్స్‏కు సంబంధించిన విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తూ నిహారిక చేసే రచ్చ మాములుగా ఉండదు.

వివాహం అనంతరం కూడా నిహారిక వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్య పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదైంది. గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్‏మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ ఎంతంటే..

Postal Life Insurance: ఈ ఇన్సూరెన్స్ కాలపరిమితి ఏడాది కాదు.. జీవితకాలం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..

YS Viveka: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితుడు అరెస్ట్!

Visakha Agency: విశాఖపట్నం ఏజెన్సీలో గిరిజనుల అవస్థలు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను..