Gautam Raju: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు అందరు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. సినిమా ప్రముఖులకు సైతం కరోనా సోకడం ఇప్పుడు కలవరపెడుతుంది. కరోనా కారణంగా చాలా మంది దిగ్గజాలను ఇప్పటికే కోల్పోయాం. తాజాగా టాలీవుడ్ నటుడు, కమెడియన్ గౌతమ్ రాజు సోదరుడు సిద్ధార్థ్ కరోనాతో మృతి చెందారు. దాంతో గౌతమ్ రాజు ఇంట విషాదం నెలకొంది. అయితే తన సోదరుడి మరణానికి కొందరు వైద్యుల నిర్లక్షమే కారణమని అంటున్నారు గౌతమ్ రాజు. వైద్యుల నిర్లక్ష్యం తోనే తాను సోదరుడిని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు గౌతమ్ రాజు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ రాజు సోదరుడు మృతి చెందారు.
రికమెండేషన్ కేసులకోసం ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రోగుల ప్రాణాలు తీస్తున్నారని కొందరు వైద్యులపై ఆయన ఆరోపణలు చేసారు. ప్రభుత్వం సదుపాయాలు కల్పించినా కొందరు వైద్యులు మానవతా దృక్పథం చూపించడంలేదన్నారు గౌతమ్ రాజు. రోగులలో మనో దైర్యం నింపడంలేదని అన్నారు. చనిపోతారని ముందే చెప్పి రోగులలో ఆందోళన కలిగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు.
మరిన్ని ఇక్కడ చదవండి :