Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నటించిన చిత్రం 'జన నాయగన్' ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో అమెజాన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేటు భారీగా పెరిగిందని తెలుస్తోంది.

Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ జననాయగన్ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?
CM Vijay Jana Nayagan Movie

Updated on: May 13, 2026 | 7:38 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కు ప్రజాదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ ను అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ పరిణామం మొత్తం చిత్ర పరిశ్రమను మార్చేసింది. ఇదే క్రమంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య పోటీ మొదలైనట్లు సమాచారం. ప్రారంభంలో, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సెన్సార్ ప్రక్రియ అసంపూర్తిగా ఉండటం వల్ల విజయ్ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో అమెజాన్ ఈ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. జయ నాయగన్ సినిమాకు ఓటీటీ డీల్ ను భారీగా తగ్గించినట్లు ప్రచారం జరిగింది. కానీ కాలం గిర్రున తిరిగింది. రాజకీయాల్లో విజయ్ సాధించిన అఖండ విజయం, ముఖ్యమంత్రి స్థాయి ఆకర్షణ జన నాయగన్ చిత్రానికి కొత్త క్రేజ్ ను తీసుకొచ్చాయి.
ఎన్నికలకు ముందు సైలెంట్ గా ఉన్న ఓటీటీ కంపెనీలు, ఇప్పుడు ‘జన నాయగన్’ హక్కుల కోసం ఎగబడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఒక కొత్త పెద్ద ఓటీటీ కంపెనీ, గతంలో అమెజాన్ ఇచ్చిన ఆఫర్ కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు ఆఫర్ చేసింది. ఆ మొత్తం రూ. 150 కోట్లు ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కొత్త ఒప్పందం కుదిరితే, అది చిత్ర నిర్మాతలకు పెద్ద వరం అవుతుంది. ఎందుకంటే ‘టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల ఆర్థిక ఒత్తిడి నడుమ, ‘జన నాయగన్’ తెచ్చిపెట్టే లాభం నిర్మాతలకు భారీ ఊతమిస్తుంది. ‘జన నాయగన్’ సినిమా రెండు వారాల్లో విడుదల కానుందని నిర్మాత కె. వెంకట్ నారాయణ్ తెలిపారు. ఈ సినిమా హక్కుల కోసం ట్రేడ్ వర్గాల్లో పలు కంపెనీలు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఆయన సరసనస పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మమితా బిజు మరో కీలక పాత్ర చేసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విలన్ గా చేశాడు.

150 కోట్ల ఆఫర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us