CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

|

Dec 22, 2024 | 10:13 PM

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ
Allu Arjun, CM Revanth Reddy
Follow us on

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

 

ఇవి కూడా చదవండి

అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడి పై స్పందించారు. ‘హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పౌరులకు రక్షణ కల్పించడంలో, పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది’ అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.

ఏసీపీ విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పై..

మరోవైపు  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై  ఏసిపి విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసిపిగా పని చేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పెట్టారు.  దీనిపై పోలీస్ శాఖ సిరియస్ అయ్యింది. దీనిపై  డీసీపీ సెంట్రల్ జోన్ డీసీసీ మాట్లాడుతూ.. ‘విష్ణు మూర్తి పై డిజిపి ఆఫిస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాం. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది.  శాఖ పరమైన చర్యలు ఎదురుకోవాల్సిందే’ అని చెప్పుకొచ్చారు.

 

రేవంత్ రెడ్డి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి