Manchu Vishnu – Manchu Manoj: రోడ్డున పడ్డ మంచు విష్ణు, మనోజ్ వివాదం.. డయల్ 100కు కాల్…

|

Mar 24, 2023 | 11:51 AM

మంచు ఫ్యామిలీలో విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. విష్ణు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనోజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Manchu Vishnu - Manchu Manoj: రోడ్డున పడ్డ మంచు విష్ణు, మనోజ్ వివాదం.. డయల్ 100కు కాల్...
Vishnu Vs Manoj
Follow us on

మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదం  రోడ్డునపడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్‌గా పెట్టాడు మనోజ్‌. మనోజ్‌ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విబేధాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. ఈయన మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు. మొదట్లో సారథి.. విష్ణుకు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. కాలక్రమేణా విష్ణు నుంచి దూరం జరిగి.. మోహన్ బాబుకు దగ్గరయ్యారు.  ఈ మధ్య మంచు మనోజ్‌‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ.. అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు మనోజ్. విష్ణు తరచూ ఇలా చేస్తున్నాడంటూ మనోజ్‌ కామెంట్‌ చేశారు. మేమేమైనా ఊరికే ఇచ్చామా, తీసుకున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. కాగా మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు తన ఫ్యామిలీతో కలిసి జస్ట్ ఓ గెస్ట్‌గా మాత్రమే వచ్చి వెళ్లాడు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి మధ్య విబేధాలు నిజమే అని తాజా ఘటనతో నిజమైంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..