Cinema Lovers Day: సినిమా లవర్స్ డే ఆఫర్.. శుక్రవారం 99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?

మూవీ లవర్స్ కు బంపరాఫర్. సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్టీప్లెక్స్ థియేటర్లు శుక్రవారం (ఏప్రిల్ 19) ఓ గొప్ప ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చాయి. అదేంటంటే.. కేవలం 99 రూపాయలకే తమ మల్టీప్లెక్స్ లో సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనున్నాయి

Cinema Lovers Day: సినిమా లవర్స్ డే ఆఫర్.. శుక్రవారం 99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
Multiplex

Updated on: Apr 18, 2024 | 7:15 PM

మూవీ లవర్స్ కు బంపరాఫర్. సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్టీప్లెక్స్ థియేటర్లు శుక్రవారం (ఏప్రిల్ 19) ఓ గొప్ప ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చాయి. అదేంటంటే.. కేవలం 99 రూపాయలకే తమ మల్టీప్లెక్స్ లో సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనున్నాయి . ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, మంజుమ్మెల్ బాయ్స్ తదితర సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే శుక్రవారం పారిజాత పర్వం, శరపంజరం, మారణాయుధం, టెనెంట్ సినిమాలు రిలీజవుతున్నాయి. అలాగే కల్ట్ క్టాసిక్ సినిమాలైన హ్యాపీ డేస్, జెర్సీ మూవీస్ మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఏప్రిల్ 19న హిందీలో ‘లవ్ సెక్స్ ఔర్ దోఖా’, ‘దో ఔర్ దో ప్యార్’ విడుదలవుతున్నాయి. కాబట్టి సినిమా ప్రేమికులు దీనిని ఉపయోగించుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో మీకు నచ్చిన సినిమాలను తక్కువ ధరలకు చూడవచ్చు. సెప్టెంబర్ 2022లో ‘జాతీయ సినిమా దినోత్సవం’ సందర్భంగా తొలిసారిగా 75 రూపాయల టిక్కెట్ ఆఫర్ ఇవ్వబడింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది.

2023లో ‘సినిమా ప్రేమికుల దినోత్సవం’ జరుపుకున్నారు. అప్పుడు కూడా జనం తండోపతండాలుగా మల్టీప్లెక్స్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా లవర్స్ డే ను పురస్కరించుకుని ఇప్పుడు PVR-Inox మళ్లీ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీవీఆర్ తో పాటు మరి కొన్ని మల్టీప్లెక్స్ ఛైన్ థియేటర్లు కూడా ఈ ఆఫర్ ను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే శుక్రవారం దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మొదటి దశ పోలింగ్ జరగతుంది. ఇలాంటి ఆఫర్లతో పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని పలు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ను క్యాన్సిల్ చేశారు.

ఇవి కూడా చదవండి

 

పోలింగ్ ప్రాంతాల్లో ఆఫర్ క్యాన్సిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.