Nenu Ready: నేను రెడీ అంటున్న యంగ్ హీరో.. పోస్టర్ అదిరిపోయిందిగా..

హవిష్, త్రినాధ రావు నక్కిన కాంబినేషన్ లో.. నిఖిల కొనేరు నిర్మిస్తున్న సినిమా నేను రెడీ. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్ పై 'నేను రెడీ' సినిమా తెరకెక్కుతుంది.  పాండిచ్చేరిలో సాంగ్ షూట్ పూర్తి అయ్యిందని హవిష్ మోస్ట్ స్టయిలీష్ యాక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

Nenu Ready: నేను రెడీ అంటున్న యంగ్ హీరో.. పోస్టర్ అదిరిపోయిందిగా..
Nenu Ready

Updated on: Dec 25, 2025 | 4:46 PM

‘నువ్విలా’, ‘జీనియస్’, ‘రామ్ లీల’, ‘సెవెన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవిష్. ఇప్పుడు ఆయన దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలిసి సినిమా చేస్తున్నారు. ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’, ‘ధమాకా’, ‘మజాకా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన ‘నేను రెడీ’ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర బృందం క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హవిష్ చాలా హుందాగా, అదే సమయంలో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. చక్కగా దువ్విన జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డం, నల్లటి అద్దాల కళ్ళజోడు అతనికి ఒక సీరియస్ లుక్ ఇచ్చాయి. ముదురు రంగు ప్యాంటులో ఇన్ చేసిన చెక్ షర్ట్, ఐడీ కార్డు, భుజంపై వేలాడుతున్న బ్రౌన్ కలర్ ఆఫీస్ బ్యాగ్‌తో అతని లుక్ మిడిల్ క్లాస్ మ్యాన్ లా వుంది. అతని నిలబడిన తీరు యాక్షన్ కి సిద్ధంగా ఉన్నట్లు వుంది.

నవ్వులు పూయించే వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరుగాంచిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన, హవిష్‌ను మల్టీ లేయర్స్ వున్న హ్యుమర్ రోల్ లో చూపిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, చిత్ర బృందం నిన్న పాండిచ్చేరిలో హీరో హీరోయిన్ల పై చిత్రీకరించిన సాంగ్ షూట్ పూర్తి చేసింది, ఈ పాటకు విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ అద్భుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ‘నేను రెడీ’ టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను పొంది, సినిమాపై అంచనాలను పెంచింది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పలువురు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మెలొడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ విజువల్స్ అందిస్తున్నారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను విక్రాంత్ శ్రీనివాస్ అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.