Janhvi Kapoor: ఆ పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి? వివాదంలో జాన్వీ కపూర్ సినిమా.. కేసు నమోదుకు డిమాండ్

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా చిక్కుల్లో పడింది. ఈ మూవీలోని కొన్ని సీన్లపై ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Janhvi Kapoor: ఆ పవిత్ర స్థలంలో అలాంటి పనులేంటి? వివాదంలో జాన్వీ కపూర్ సినిమా.. కేసు నమోదుకు డిమాండ్
Janhvi Kapoor

Updated on: Aug 14, 2025 | 9:16 PM

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి. ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేయనున్నాడు. తుషార్ జలోటా డైరెక్షన్ లో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే పరమ్ సుందరి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. . డిఫరెంట్‌ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ చూపించారు. అయితే పరమ్ సుందరి సినిమా ఇప్పుడు ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఇందుకు కారణం ఆ సినిమా ట్రైలర్. ఇందులో చర్చిలో వచ్చే సన్నివేశాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పరమ్ సుందరి సినిమా సీన్లపై వాచ్‌డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సినిమా నుంచి చర్చి సీన్లను వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.

‘చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలం. దీనిని అసభ్యకరమైన కంటెంట్‌కు వేదికగా చిత్రీకరించవద్దు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమే అవుతుంది. ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్‌ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలి’ అని వాచ్‌డాగ్ ఫౌండేషన్‌కు చెందిన న్యాయవాది గాడ్‌ఫ్రే పిమెంటా పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై హీరో, హీరోయిన్లతో పాటు  పరమ్ సుందరి చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చర్చిలో రొమాంటిక్ సీన్స్ పై క్రైస్తవ సంఘాల అభ్యంతరం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి