చిరంజీవి మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. వైష్ణవ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా ఇంకా రిలీజ్ కాలేదు. ఓటీటీల నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, మొదటి సినిమా కావడంతో ఆ వైపు మొగ్గు చూపలేదు. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండే సినిమా షూటింగ్ మొదలెట్టాడు వైైష్ణవ్. క్రిష్ డైరెక్షన్‍లో ‘కొండ పొలం’ నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా సమయంలో సగం చిత్రీకరణ చేసి నిలిచిపోయిన సినిమాలను ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తే, వైష్ణవ్ మాత్రం ఏకంగా కొత్త సినిమా షురూ చేశాడు. సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ ముగిసిన అనంతరం ఈ చిత్రాన్ని జీ 5లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగును అక్టోబర్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే’ నిర్మాతలకే తేజ్ మరో సినిమా చేయడానికి సైన్ చేశాడు.
Also Read :
మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్
గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ