Chiranjeevi: చిరంజీవి పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి మురిసిపోయిన అలీ దంపతులు.. ఏంటో తెలుసా? వీడియో

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితులు, సన్నిహితులకు ప్రతి ఏడాది కొన్ని గిఫ్టులు పంపిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడ ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ దంపతులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Chiranjeevi: చిరంజీవి పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి మురిసిపోయిన అలీ దంపతులు.. ఏంటో తెలుసా? వీడియో
Chiranjeevi, Ali

Updated on: Jun 01, 2025 | 3:14 PM

మెగాస్టార్‌ చిరంజీవిని అమితంగా అభిమానించే నటుల్లో ప్రముఖ కమెడియన్ అలీ ఒకడు. చిరంజీవికి కూడా అలీ అంటే చాలా ఇష్టం. అందుకే అతనితో పాటు బ్ర్మహ్మనందానికి ఏటా వేసవికి కొన్ని మామిడి పండ్లను పంపిస్తారట. అలా ఈసారి కూడా తన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి పండ్లను అలీకి పంపించారు చిరంజీవి. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు. అయితే ఈసారి మామిడి పండ్లతో పాటు మరికొన్ని బహుమతులు కూడా వచ్చాయి. అవే అత్తమ్మాస్ కిచెన్ వంటకాలు.. ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్‌ తదితర రెడీ టు మిక్స్‌ పొడులను అలీ దంపతులకు పంపించారు చిరంజీవి- సురేఖ. వీటిని సపరేట్ గా ప్యాక్ చేసి మరీ అలీ ఇంటికి పంపారు మెగాస్టార్. వీటిని అలీతో భార్య అతని భార్య జుబేదా తెగ సంబరపడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అన్న తమకోసం వీటిని ప్రేమగా పంపారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అలీ దంపతులు షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసనతో కలిసి అత్తమ్మాస్‌ కిచెన్‌ పేరిట గతేడాది ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. ప్రధానంగా అప్పటికప్పుడు ఈజీగా వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్‌ పొడులను ఈ అత్తా కోడళ్లు విక్రయిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అవకాయ పచ్చడిని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కూడా అత్తమ్మాస్ కిచెన్ అవకాయ పచ్చడిని పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి పంపిన గిఫ్టులతో అలీ- జుబేదా దంపతులు.. వీడియో

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.