‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూసి మనసు మార్చుకున్న జంట.. ఆ ఒక్క సీన్ తో విడాకులు క్యాన్సిల్

'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జోడీగా నటించారు. కొన్ని కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయిన వారు క్లైమాక్స్ లో మళ్లీ ఏకమవుతారు. ఇప్పుడిదే సినిమాను చూసిన ఓ జంట తమ మనసు మార్చుకుందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే వెల్లడించారు.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా చూసి మనసు మార్చుకున్న జంట.. ఆ ఒక్క సీన్ తో విడాకులు క్యాన్సిల్
Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 16, 2026 | 5:45 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ మెగా మూవీ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించింది. అలాగే విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో మెరిశారు. కాగా ఈ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న చిరంజీవి, నయన తార కొన్ని కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతారు. ఇద్దరు పిల్లలున్నప్పటికీ ఎవరి దారి వారు చూసుకుంటారు. అయితే చివరకు వారు ఎలా కలిశారన్నదే ‘మన శంకరవరప్రసాద్ గారు’. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి ఒక ఆసక్తకర విషయం పంచుకున్నారు. అదేంటంటే.. విడాకులు తీసుకోవాలనుకున్న ఒక జంట తన సినిమాను చూసి మనసు మార్చుకున్నారట. విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారట.

‘ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్‌గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్‌ మాట్లాడుకున్నారు. విడాకులు క్యాన్సిల్ చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్‌ రాసిన మా డైరెక్టర్ అనిల్‌ రావిపూడికి హ్యాట్సాఫ్‌’ అని మెచ్చుకున్నారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

సినిమాలో ఆ సీన్ హైలెట్..

కాగా ఈ సినిమాల చిరంజీవి తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వాహబ్ నటించారు. నయనతారకు, ఆమె మధ్య వచ్చే ఒక సీన్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆ సీన్ లో భార్యాభర్తల బంధం గురించి జరీనా చెప్పిన డైలాగులకు థియేటర్లలోని జనం చప్పట్లు కొడతారు. ‘భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. ఎవరి ప్రాబ్లమ్స్ వారే సాల్వ్ చేసుకోవాలి’ అని ఆమె చెప్పిన మాటలే ఇప్పుడు ఓ జంటకు ప్రేరణ నిచ్చాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

200 కోట్ల క్లబ్ లో మన శంకరవరప్రసాద్ గారు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..