తెలుగు రాష్ట్రాల పోలీసుల‌కు చిరంజీవి స‌లాం…

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 3:50 PM

ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులపై మెగాస్టార్‌ చిరంజీవి ఎంతగానో ప్రశంసించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని కితాబిచ్చారు.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. లాక్‌డౌన్‌లో సామాన్య ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతమని చెప్పారు. నిద్రాహారాలు మాని వాళ్లు […]

తెలుగు రాష్ట్రాల పోలీసుల‌కు చిరంజీవి స‌లాం...
Follow us on

ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులపై మెగాస్టార్‌ చిరంజీవి ఎంతగానో ప్రశంసించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారని కితాబిచ్చారు.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. లాక్‌డౌన్‌లో సామాన్య ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. ఓ పోలీసు బిడ్డగా వారు చేస్తున్న విశేష కృషికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల పనితీరు అద్భుతమని చెప్పారు. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదన్నారు. తాను హైదరాబాద్‌లో స్వయంగా చూస్తున్నానని…. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ చాలా విజయవంతంగా జరిగిందని అన్నారు. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కరోనాను తుదిముట్టించడంలో, ఆంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, సహకరించాలని చెప్పారు. పోలీసు వారు చేస్తున్న అమోఘమైనటువంటి ఈ ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్‌ చేస్తున్నానంటూ చివరగా .. జైహింద్‌ అని వీడియోను ముగించారు. ఇదిలాఉంటే పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ చిరంజీవి పోస్ట్‌ చేసిన వీడియోపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.