ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం కోసం హర్షించదగ్గ విషయన్నారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలంటున్నారు చిరంజీవి. కాలానుగుణంగా, దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా టికెట్ల రేట్లు ఉండాలన్నది ఆయన ట్వీట్‌లో కనిపిస్తున్న అంశం. దేశమంతా ఒకే ట్యాక్స్‌గా జీఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అంటున్నారు చిరంజీవి. దయచేసి టికెట్ రేట్లపై పునరాలోచించండి..ప్రోత్సాహం ఉంటేనే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకుంటుందంటూ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Appeal to Hon’ble @AndhraPradeshCM
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే..
సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షోలో ఉంటాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదని…కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఉంటుందన్నారు. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలకు పైగా అమ్మిన పరిస్థితి ఉందని.. ఇప్పుడు అలాంటి పద్దతులు కుదరవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
Also Read: AP Weather: ఏపీకి మరో అల్పపీడన గండం… మరోసారి ఆ జిల్లాలకే ముప్పు