Waltair Veerayya: మాస్‌ కా బాప్‌.. కర్ణాటకలో మెగా ఫ్యాన్స్ హంగామా..154 ‘వాల్తేరు వీరయ్య’ పోస్టర్లతో భారీ ర్యాలీ

వాల్తేరు వీరయ్య సినిమా విడుదలను కర్ణాటకలోని ఆయన అభిమానులు పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి రోడ్లపై డప్పులు మోగిస్తూ.. డ్యాన్స్‌లు చేస్తూ జాతరగా ర్యాలీ నిర్వహించారు.

Waltair Veerayya: మాస్‌ కా బాప్‌.. కర్ణాటకలో మెగా ఫ్యాన్స్ హంగామా..154 ‘వాల్తేరు వీరయ్య’ పోస్టర్లతో భారీ ర్యాలీ
Megastar Chiranjeevi

Updated on: Jan 13, 2023 | 3:20 PM

మెగాభిమానులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. వారు వేయికళ్లతో ఎదురుచూసిన వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి అడుగుపెట్టాడు. దీంతో ఇవాళ (జనవరి 13) తెల్లవారుజామునుంచే సినిమా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక మొదటి ఆట నుంచే సినిమాకు సూపర్‌హిట్ టాక్‌ రావడంతో సిల్వర్‌ స్ర్కీన్‌పై వీరయ్య సందడి చూసేందుకు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్‌ హంగామా మాములుగా లేదు. ఎక్కడచూసినా చిరంజీవి బ్యానర్లు, కటౌట్లే దర్శనమిస్తున్నాయి. డప్పుడు, వాయిద్యాలతో మెగాభిమానులు డ్యాన్స్‌లు చేస్తున్నారు. కాగా చిరంజీవికి దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈక్రమంలో వాల్తేరు వీరయ్య సినిమా విడుదలను కర్ణాటకలోని ఆయన అభిమానులు పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి రోడ్లపై డప్పులు మోగిస్తూ.. డ్యాన్స్‌లు చేస్తూ జాతరగా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ‘మెగా మానియా మజాకానా’ అంటూ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా కే.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో తెరెకెక్కిన వాల్తేరు వీరయ్య చిరంజీవికి 154 సినిమా. దీనిని పురస్కరించుకునే 154 పోస్టర్లతో ఆటో ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. క్యాథరిన్‌ థెరిస్సా, ప్రకాశ్‌రాజ్‌, బాబీసింహా, వెన్నెల కిశోర్‌, సత్యరాజ్‌, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు సినిమాలో మెరిశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ముఖ్యంగా బాలీవుడ్ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా బాస్‌ పార్టీ సాంగ్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయంటున్నారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..