AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: రోమాలు నిక్కపొడుచుకునే చిరు స్పీచ్.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. నెట్టింట వైరల్

అన్న ఎన్టీఆర్ తర్వాత  దిగువ మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రపథానికి ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరికీ మరో సారుప్యత కూడా ఉంది.

Chiranjeevi: రోమాలు నిక్కపొడుచుకునే చిరు స్పీచ్.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. నెట్టింట వైరల్
Chiranjeevi
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2021 | 6:36 PM

Share

అన్న ఎన్టీఆర్ తర్వాత  దిగువ మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రపథానికి ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరికీ మరో సారుప్యత కూడా ఉంది. ఎన్టీఆర్‌ను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లు ఆయన్ను ‘అన్న గారు’ అని ఆఫ్యాయంగా పిలుస్తారు. అలాగే చిరుని కూడా ‘అన్నయ్య’ అని ప్రేమగా పిలచుకుంటారు. సౌత్ నుంచి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి స్టార్ చిరంజీవి. ఆయన డ్యాన్సింగ్ గ్రేస్‌ను అందుకోగల మరో హీరో తెలుగులో ఇంతవరకూ రాలేందంటే అతిశయోక్తి కాదు. కామెడీ టైమింగ్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్స్.. ఏవైనా సరే 100 శాతం ఇవ్వడం చిరు నైజం. అందుకే ఆయన కోట్లాది అభిమాన గణం ఉంది. అయినా అహం, గర్వం ఆయనలో కనిపించవు. అంతేకాదు చిరు చాలా మృదు స్వభావి. ఎదుటివారి హృదయాలను గాయపరచాలని ఆయన అస్సలు అనుకోరు. ఎన్నో దెబ్బలు తిని పూజలుందుకొంటోన్న వెండితెర ఇలవేల్పు అతను. తనను ఎవరైనా కామెంట్ చేసినా సరే.. వారి విజ్ఞతకు వదిలేస్తారు. తనను ఇంత వాడిని చేసిన కళామతల్లి అంటే ఆయనకు విపరీతమైన గౌరవం. అందుకే ఇండస్ట్రీలోని వారిని తన కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఇన్ని చేసినా తొలి రాయి పడేది ఆయన మీదే. అదేంటో తెలియదు కానీ.. తన మీద పడిన రాళ్లను, పువ్వులను ఒకేలా స్వీకరిస్తారు చిరు.

కాగా తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని.. ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుకు సాగాలని కోరుకునే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుత పరిణామాలు ఆయన మనసును గాయపరుస్తున్నాయని మెగాస్టార్ సన్నిహితులు చెప్పే మాట. ఈ క్రమంలో చిరంజీవి వజ్రోత్సవాల సమయంలో ఇచ్చిన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది. అప్పట్లో ఆ స్పీచ్ విననివారు తాజాగా దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. చిరు మాట్లాడిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరు మాట్లాడుతోన్న సమయంలో.. అక్కడ ఉన్న సెలబ్రిటీలు కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్.. చిరు స్వీచ్ ఇచ్చిన అనంతరం వచ్చి కౌగిలించుకున్నారు.  ఆ వీడియో దిగువన చూడండి.

Also Read: Deepika Pilli: మెరిసే కళ్ల ఊర్వశి.. అందాల రాక్షసి.. కళ్లతో మాయ చేసే…