
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్ సినిమాలకు లెక్కే లేదు. అపజయాలు అంటే చాలా అరుదు. ఒకప్పుడు ఆయన సినిమాలు 200, 300 రోజులు ఆడుతూ రికార్డులు సృష్టించేవి. ఇప్పుడు కలెక్షన్స్ లెక్కలే ఎక్కువ. అయితే చిరు చేసిన మంచి హార్ట్ టచింగ్ మూవీ ‘డాడీ’. ఫాదర్–డాటర్ సెంటిమెంట్‌తో 2001లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సురేశ్ కృష్ణ డైరెక్షన్‌లో, అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. అసలు ఈ కథ వినగానే చిరంజీవి .. వెంకటేష్ చేస్తే బాగుంటుంది అన్నారట. కానీ రచయిత భూపతిరాజా మాత్రం ఈ కథ మెగాస్టార్‌కే సూట్ అవుతుంది అని పట్టుబట్టారు. రచయిత నమ్మకమే నిజమైంది. సినిమా చిరు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
ఈ మూవీలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా? తన ముద్దు నటనతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. చిరు–కూతురు సన్నివేశాలు ఇప్పటికీ కళ్లముందు తిరుగుతాయి. ఆ చిన్నది ఇప్పుడు పెద్దయ్యాక గ్లామరస్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకు చెందిన ఆమెకు తెలిసిన వారి ద్వారా మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ కాదు. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చే ఫొటోలు మాత్రం ఆమె యంగ్ అండ్ స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తన జిమ్ ఫోటోలతో కుర్రకారకు చెమటలు పట్టించింది ఈ సుందిరి.. ఆ ఫోటోలు మీరూ చూసేయండి…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.