Chiranjeevi: మెగా పవర్ స్టార్ బర్త్ డేలో ఆర్ఆర్ఆర్ టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్

|

Mar 28, 2023 | 6:04 PM

ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే జపాన్ లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది.

Chiranjeevi: మెగా పవర్ స్టార్ బర్త్ డేలో ఆర్ఆర్ఆర్ టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్
Chiranjeevi
Follow us on

ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించి అలరించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే జపాన్ లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే గోల్డెన్ గ్లోబల్ అవార్డు ను కూడా అందుకుంది.

తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌ను సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. చరణ్ పుట్టిన రోజును వేడుకగా చేశారు మెగా ఫ్యామిలీ. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆయన సతీమణిని, కీరవాణి ఆయన భార్యను, రాహుల్ సిప్లిగంజ్ కు శాలువాలు కప్పి సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి.

ఆ ఫొటోస్ ను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ” ఆస్కార్ విజేతలని మిత్రుల సమక్షంలో సత్కరించుకోవటం నిజమైన వేడుక అనిపించింది. తెలుగు వారు భారతీయ సినిమా కి సాధించిన ఈ పురస్కారం చరిత్ర గా నిలిచిపోతుంది” అని మెగాస్టార్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.