Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల మరణించారన్నది ఓ నమ్మలేని వార్త అన్నారు చిరజీవి, బాలకృష్ణ. సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన బాలయ్య.. సిరివెన్నెల శాస్త్రిగారు శాశ్వతంగా మిగిలిపోతారు. జనని జన్మ భూమి సినిమాలో మొదటి పాట రాసారు.. అది నా పూర్వజన్మ సుకృతం అన్నారు బాలయ్య. చలన చిత్ర పరిశ్రమ తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య.. ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం.. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని అన్నారు బాలయ్య. ఆయన స్థాయికి ఎవ్వరు ఎదగలేదు.. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. ఆయన కళామ్మతల్లికి ఇంకా ఎంతో సేవలు అందించాల్సింది అంటూ బాలయ్య భావోద్వేగాన్ని గురయ్యారు. మంచివ్యక్తిని పోగొట్టుకున్నాం అన్నారు మురళీమోహన్.. సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఎప్పుడు చిరునవ్వుల సీతారామ శాస్త్రి అంటూ పిలిచేవాడిని అంటూ గుర్తు చేసుకున్నారు మురళీమోహన్.
సీతారాం శాస్త్రిగారు చాలా ఇష్టమైన వ్యక్తి.. సిరివెన్నెల నా కుటుంబసభ్యులు అన్నారు అల్లు అర్జున్. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వారు మళ్లీ పుట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించుకున్నారు. ఆయనతోపాటు దేవీ శ్రీ ప్రసాద్ సిరివెన్నెలను కడసారి చూసేందుకు వచ్చారు. చిరజీవి మాట్లాడుతూ.. ఆయన చివరిగా ఎక్కువసేపు మాట్లాడింది నాతోనే అన్నారు చిరు. ఈ నెలాఖరున వస్తాను అన్న వ్యక్తి ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు.. బాలుగారు, సిరివెన్నెలలాంటి వారు మళ్లీ రారు అంటూ ఎమోషన్ అయ్యారు మెగాస్టార్. నన్ను ఉద్దేశించి పాటలు రాశానని చెప్పారు.. ఆయన నా గురించి రాయడం నా పూర్వజన్మ సుకృతి అన్నారు మెగాస్టార్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’