Godfather : బాక్సాఫీస్‌ రూలర్‌‌గా మెగాస్టార్.. రెండో రోజు ‘గాడ్ ఫాదర్’ ఎంత వసూల్ చేసిందో తెలుసా..

|

Oct 07, 2022 | 3:15 PM

కరోనా.. ఓటీటీ విజృంభిన, టికెట్ హై రేట్స్..ఇండస్ట్రీ ఇష్యూస్‌ ! వీటన్నింటి మధ్య.. సూపర్ డూపర్ కలెక్షన్స్‌ను రాబడుతున్నారు. ఇండస్ట్రీకి ఊపునిస్తున్నారు.

Godfather : బాక్సాఫీస్‌ రూలర్‌‌గా మెగాస్టార్.. రెండో రోజు గాడ్ ఫాదర్ ఎంత వసూల్ చేసిందో తెలుసా..
Godfather
Follow us on

ఆప్టర్ లాంగ్ గ్యాప్ … బాక్సాఫీస్‌ రూలర్‌ గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. తన రీసెంట్ రిలీజ్… గాడ్‌ ఫాదర్ సూపర్ డూపర్ హిట్‌తో.. రికార్డులు తిరగరాస్తున్నారు. కరోనా.. ఓటీటీ విజృంభిన, టికెట్ హై రేట్స్..ఇండస్ట్రీ ఇష్యూస్‌ ! వీటన్నింటి మధ్య.. సూపర్ డూపర్ కలెక్షన్స్‌ను రాబడుతున్నారు. ఇండస్ట్రీకి ఊపునిస్తున్నారు. దాంతో పాటే ఈ సారి దసరాను తన పేరిట బుక్ చేసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయిన గాడ్‌ ఫాదర్ మూవీ.. పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతోంది. మలయాళ లూసీఫర్ కు రిమేక్‌ గా తెరకెక్కిన ఈసినిమా.. ఆ సినిమా కంటే బెటర్ గా ఉందనే టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. జస్ట్ రిలీజ్‌ అయిన ఒక్క రోజులోనే వరల్డ్ వైడ్ 38 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి.. అందర్నీ షాక్ చేసింది.

ఇక తాజాగా చిరు గాడ్‌ ఫాదర్ 70 క్రోర్ మార్క్‌ను టచ్‌ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే… గాడ్ ఫాదర్ సినిమా 50 కోట్ల గ్రాస్‌ను వలర్డ్‌ వైడ్ కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీని ఖుషీ చేస్తోంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ పోస్ట్ తో అనౌన్స్ చేశారు మేకర్స్ . రెండో రోజు ఏ ఏ ఏరియాల్లో ఎంత కలెక్ట్ చేసిందట..

ఇవి కూడా చదవండి

నైజాం 5.63 కోట్లు, సీడెడ్ 5.11కోట్లు, ఉత్తరాంధ్ర 2.27 కోట్లు, ఈస్ట్ 2.11 కోట్లు, వెస్ట్ 1.04 కోట్లు, గుంటూరు 2.35 కోట్లు, కృష్ణా 1.20 కోట్లు, నెల్లూరు 0.88 కోట్లు, ఏపీ – తెలంగాణ (టోటల్) 20.59 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.26 కోట్లు, హిందీ 1.60 కోట్లు, ఓవర్సీస్ 2.55 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 27.00 కోట్లు వసూల్ చేసింది గాడ్ ఫాదర్ సినిమా.