Chinmayi Sripada: బ్లెడ్ ఎప్పుడు డొనేట్ చెయ్యాలో తెలుసా… విలువైన విషయాన్ని తెలిపిన సింగర్ చిన్మయి..

|

May 02, 2021 | 6:23 AM

తన స్వీట్‌ వాయితో పాటలు పాడుతూ.. హీరోయిన్లకు డబ్బింగ్‌ చెబుతూ.. పాపులర్ అయిన చిన్మయి.. రీసెంట్‌ గా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

Chinmayi Sripada: బ్లెడ్ ఎప్పుడు డొనేట్ చెయ్యాలో తెలుసా... విలువైన విషయాన్ని తెలిపిన సింగర్ చిన్మయి..
Follow us on

Chinmayi Sripada : తన స్వీట్‌ వాయితో పాటలు పాడుతూ.. హీరోయిన్లకు డబ్బింగ్‌ చెబుతూ.. పాపులర్ అయిన చిన్మయి.. రీసెంట్‌ గా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. చిన్మయి శ్రీపాద ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా చిన్మయి మంచి పేరు సంపాదించుకున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తన గళాన్ని వినిపించారు. తాజాగా  కోవిడ్‌ వ్యాక్సినేషన్ తరువాత బ్లడ్‌ డొనేషన్‌కు.. సంబంధిచి నేషనల్ బ్లడ్‌ ట్రాన్స్‌మిషన్ కౌన్సిల్ ఇచ్చిన ఓ నోట్‌ ను అందరికీ సింపుల్ గా అన్ని భాషల్లో చెప్పింది చిన్మయి.

వ్యాక్సినేషన్ తరువాత 56 రోజుల వరకు బ్లడ్‌ డొనేట్‌ చేయరాదని.. దానివల్ల ముందు ముందు బ్లడ్‌ బ్యాంక్‌లో బ్లడ్‌ అందుబాటులో లేకుండా పోతుందని.. సో… వ్యాక్సినేషన్‌కు ముందే బ్లడ్‌ డొనేట్ చేయాలని నెటిజన్లకు చెప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న్నారు. ప్రభుత్వాలు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :