Celebrity Cricket League 2023: చిత్తుగా ఓడిన ముంబై హీరోస్.. 10 వికెట్ల తేడాతో చెన్నై రైనోస్ విజయం..
Chennai Rhinos Vs Mumbai Heroes: రాయ్‌పూర్‌లో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో సోహైల్ ఖాన్ నేతృత్వంలోని ముంబై హీరోస్‌ను విష్ణు విశాల్ జట్టు ఓడించింది. అశోక్ సెల్వన్ ఉత్తమ బౌలర్‌గా ఎంపికయ్యాడు.
Celebrity Cricket League 2023: సెలబ్రిటీ క్రికెట్ లీగ్2023 అద్భుతంగా సాగుతోంది. రెండో మ్యాచ్‌లో ముంబై హీరోస్‌పై ఆధిపత్యం చెలాయించిన చెన్నై రైనోస్.. 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై రైనోస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదటి నుంచి దూకుడుగా ఆడింది. వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో చెన్నై రైనోస్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసింది. చెన్నై రైనోస్‌కు ఓపెనింగ్ జోడీ విక్రాంత్ (40 బంతుల్లో 80 పరుగులు), వికెట్ కీపర్ రమణ (58 పరుగులు) మెరుపు ఆరంభం అందించారు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన వీరు ఆకట్టుకున్నారు. అనంతరం ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై రైనోస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
CCL 2023 మ్యాచ్ 2లో రమణ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చరిత్రలో వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో ఉత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డును దక్కించుకున్నాడు. అశోక్ సెల్వన్‌కు ఉత్తమ బౌలర్ అవార్డు లభించింది. విక్రాంత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
#CCL2023 | Chennai Vs Mumbai
Chennai Rhinos won by 10 Wickets.
Target 186 (20 Overs)
– Ramana 58* – Vikranth 80*
Best Batsman – Ramana Best Bowler – Ashok Selvan Man of the Match – Vikranth pic.twitter.com/bEGMv7Gpcd
— Christopher Kanagaraj (@Chrissuccess) February 18, 2023
క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)- 2023 షురూ అయ్యింది. ఎప్పుడూ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉండే సినీ తారలు క్రికెట్ మైదానంలోకి అడుగపెట్టారు. బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలో సందడి చేశారు. తాజాగా ఈ మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తెలుగు వారియర్స్ తో పాటు చెన్నై రైనోస్, ముంబై హీరోస్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ కిచ్చా సుదీప్ నేతృత్వంలోని కర్ణాటక బుల్డోజర్స్.. జిషు నేతృత్వంలోని బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్‌కి రాయ్‌పూర్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికైంది.
ఈ టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. ఇక బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా, కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..