
ఛత్రపతి శేఖర్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటించిన చంద్రశేఖర్ అలియాస్ ఛత్రపతి శేఖర్ .. దాదాపు రాజమౌళి చిత్రాలన్నింటిలోనూ కనిపిస్తుంటారు. అటు సినిమాలతోపాటు ఇటు సీరియల్ నటుడుగాను మంచి క్రేజ్ దక్కించుకున్నారు చంద్రశేఖర్. సహయ నటుడిగానే కాకుండా విలన్ పాత్రలతోనూ తనదైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలోని తన అనుభవాలను, ముఖ్యంగా ప్రభాస్, రాజమౌళిలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. రాజమౌళి సినిమా ప్రారంభానికి ముందు జరిగిన సమావేశంలో, తన పాత్ర భద్రం గురించి వివరించిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ సహనటులతో ఎంత స్నేహంగా, సహకారంగా ఉంటాడో తెలియజేశారు.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
ఛత్రపతి షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదకర సంఘటనను శేఖర్ గుర్తుచేసుకున్నారు. సముద్రంలో ఒడ్డుకు దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తాను ఒక చిన్న బోటులో ఉండగా, కెమెరా పెద్ద ఫిషింగ్ బోటులో ఉందన్నారు. ఒక సన్నివేశంలో నీటిలో మునిగి, యాక్షన్ చెప్పగానే పైకి వచ్చి అజయ్ కాలర్ పట్టుకోవాల్సి ఉందన్నారు. తాను పైకి రాగానే, అజయ్ తన కాలర్ పట్టుకోవడంలో విఫలమయ్యాడని, తాను ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయానని.. అప్పుడే ప్రభాస్ తన కాలు పట్టుకుని పైకి లాగారని అన్నారు. తాను నీటిలో జారిపోతున్నా, తన ప్యాంట్ పట్టుకుని లాగుతూనే ఉన్నారని తెలిపారు.ఈ ఘటన తర్వాత ప్రభాస్ చాలా కోపానికి వచ్చాడని గుర్తుచేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‌గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
ఛత్రపతి సినిమా ప్రారంభానికి ముందు, రాజమౌళి మొత్తం బృందాన్ని ఒక బీచ్ వద్దకు తీసుకెళ్లి, తన పాత్ర భద్రం గురించి వివరించారని శేఖర్ గుర్తుచేసుకున్నారు. భద్రం పాత్ర బతికి ఉన్నంత వరకు అతను చెప్పిన మాట వినాలని రాజమౌళి ఆదేశించారన్నారు. చిన్న గుడిసెలో అందరితో కలిసి కూర్చొని ప్రభాస్ కూడా కిందే కూర్చొని సన్నివేశాలను విన్నారని తెలిపారు. ప్రభాస్ కేవలం ఒక పెద్ద నటుడు కాదని, షూటింగ్ సమయంలో సహనటులతో కలిసి ఎంతో సరదాగా ఉంటారని అన్నారు.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..