Charmy kaur: ‘గుండె బద్దలైంది.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం’.. ఛార్మీ ఎమోషనల్..

కొన్నాళ్ల క్రితమే నటనకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆమె డబుల్ ఇస్మార్ట్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఛార్మీ ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఆమె తన బంధువును కోల్పోయారు.

Charmy kaur: గుండె బద్దలైంది.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ఛార్మీ ఎమోషనల్..
Charmy Kaur

Updated on: Feb 20, 2024 | 9:34 AM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ ఛార్మీ. నీతోడు కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొన్నాళ్ల క్రితమే నటనకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆమె డబుల్ ఇస్మార్ట్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఛార్మీ ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఆమె తన బంధువును కోల్పోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే తన అంకుల్‏తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తన అంకుల్ మరణంతో తన గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురైంది.

“కక్కి అంకుల్ ఎంతో స్ట్రాంగ్‏గా” ఉంటారు. అలాంటి వారు ఇలా ఆకస్మాత్తుగా మరణించారని తెలిసి షాకయ్యాను. నా గుండె బద్ధలైనట్లుగా అనిపిస్తుంది. అసలు జీవితం అనుహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ పిన్నీ, స్వీడేల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను” అంటూ ఎమోషనల్ అయ్యింది ఛార్మీ.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెంథిల్ సతీమణి రూహి అనారోగ్యంతో మరణించడంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. “నీ గురించి ఇలా పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మై డియర్ రూహి.. నాకు మాటలు రావడం లేదు. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను. చివరిసారిగా నన్ను కలిసినప్పుడు ఎంతో సరదాగా.. కబుర్లు చెప్పుకున్నాం. మనది 18 ఏళ్ల బంధం. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను” అంటూ భావోద్వేగానికి గురైంది ఛార్మీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.