Actor Prabhu: చంద్రముఖి ఫేమ్ నటుడు ప్రభుకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..ఆందోళనలో అభిమానులు…

|

Feb 22, 2023 | 7:20 AM

మరోవైపు ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నారు సినీ ప్రముఖులు. ప్రభు చివరిసారిగా విజయ్ దళపతి వారిసు చిత్రంలో నటించారు.

Actor Prabhu: చంద్రముఖి ఫేమ్ నటుడు ప్రభుకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..ఆందోళనలో అభిమానులు...
Prabhu
Follow us on

సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నారు సినీ ప్రముఖులు. ప్రభు చివరిసారిగా విజయ్ దళపతి వారిసు చిత్రంలో నటించారు.

తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుననారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో హీరోగా కనిపించారు. తొలిసినిమాతోనే నటనపరంగా మెప్పించారు ప్రభు. 80,90 దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రభు.. ప్రస్తుతం సహయ నటుడిగా కనిపిస్తున్నారు.

తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రభు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ తండ్రిగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనూ కనిపించారు. అయితే కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రిలో చేరగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.