Poonam Pandey: పూనమ్ పాండే పై మరో ఫేక్ న్యూస్.. ఏకంగా కేంద్రమే స్పందించిందిగా..

|

Feb 08, 2024 | 2:06 PM

ట్రోల్ చేసే వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు. మద్దతిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవలే తాను చనిపోయానని అనౌన్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోయానని ఓ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసింది. ఆ తర్వాత అది ఫేక్ అని పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే ఇలా చేశాను ' అని పూనమ్ వివరించింది.

Poonam Pandey: పూనమ్ పాండే పై మరో ఫేక్  న్యూస్.. ఏకంగా కేంద్రమే స్పందించిందిగా..
Poonam Pandey
Follow us on

బాలీవుడ్ నటి పూనమ్ పాండే పేరు గత వారం రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడిని తిట్టేవాళ్ళు  తుడుతున్నారు.. ట్రోల్ చేసే వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు. మద్దతిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవలే తాను చనిపోయానని అనౌన్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోయానని ఓ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసింది. ఆ తర్వాత అది ఫేక్ అని పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే ఇలా చేశాను ‘ అని పూనమ్ వివరించింది. ఆ తర్వాత ఇప్పుడు పూనమ్ ‘గురించిన  మరో ఫేక్ న్యూస్  వైరల్ అవుతుంది. దీనిపై  ఏకంగా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది.

చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పూనమ్ పాండే తన మరణ వార్తను వైరల్ చేసింది. ‘పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఆమె మేనేజర్ కూడా అదే మాట చెప్పాడు. ఆ తర్వాత దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పింది. ఇప్పుడు ఆమె గురించి కొత్త వార్త వచ్చింది. ‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ప్రచారానికి పూనమ్ పాండే అంబాసిడర్’ అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా పూనమ్ టీమ్ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పీటీఐకి స్పందించింది.

పూనమ్ పాండే పై  పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పూనమ్ పాండే ఉద్దేశం మంచిదే. అయితే ఆమె అనుసరించిన మార్గం సరిగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. పూనమ్ పాండే నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆర్జీవీ లాంటి చాలా మంది పూనమ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలు HPV వ్యాక్సిన్‌ను పొందేలా ప్రోత్సహిస్తున్నారు.

పూనమ్ పాండే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.