Vishal: సెన్సార్ బోర్డ్ పై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం.. కఠిన చర్యలు తప్పవంటూ..

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, అభినయ, రీతు వర్మ, ఎస్.జే సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీని అటు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని గురువారం ట్వీట్ చేశారు విశాల్.

Vishal: సెన్సార్ బోర్డ్ పై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం.. కఠిన చర్యలు తప్పవంటూ..
Actor Vishal

Updated on: Sep 29, 2023 | 4:17 PM

కోలీవుడ్ హీరో విశాల్ సెన్సార్ బోర్డ్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని.. తన సినిమా హిందీ వెర్షన్ కోసం లంచం చెల్సించాల్సి వచ్చిందంటూ పూర్తి వివరాలను తెలియజేస్తూ విశాల్ గురువారం ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. సెన్సార్ బోర్డ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. “సెన్సార్ బోర్డ్ కార్యాలయంలో అవినీతి జరిగినట్లు వార్తలు రావడం దురదృష్టకరమని.. అవినీతిని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదు.. ఇలాంటి వాటికి పాల్పడినవారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై విచారణ జరపనున్నారు” అంటూ ట్వీట్ చేసింది.

ఇక అసలు విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, అభినయ, రీతు వర్మ, ఎస్.జే సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీని అటు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని గురువారం ట్వీట్ చేశారు విశాల్.

వెండితెరపై అవినీతిని చూడడం తెలుసు గానీ.. ఇప్పుడు నిజ జీవితంలోనూ అవినీతి జరగడం సహించలేకపోతున్నాను. నేను నటించిన మార్క్ ఆంటోని సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కోసం ముంబయిలోని సెన్సార్ ఆఫీస్ లో పలువురు అధికారులకు రూ. 6.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు విశాల్. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు.. సర్టిఫికెట్ కోసం రూ.3 లక్షలు చెల్లించానని.. ఇలాంటి పరిస్థితి తన జీవితంలో ఎప్పుడూ చూడలదేని.. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం ఈ విషయాలను బయటపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు విశాల్. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతేకాకుండా లంచం తీసుకున్న వారి పేర్లు.. బ్యాంక్ ఖాతా వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు విశాల్. ఆయన పంచుకున్న వీడియో క్షణాల్లో వైరల్ కాగా.. తాజాగా కేంద్ర సమాచార శాఖ స్పందించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.