
తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోలీవుడ్ నటుడు విజయ్‌కాంత్ గురువారం ఉదయం చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 2016 నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. కొద్దిరోజులు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. ఈనెల 12న డిశార్జి అయిన ఆయన.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి అనారోగ్య సమస్య వేధించడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జరిపిన వైద్య పరీక్షలలో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటిలేటర్ పై చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కన్నుముశారు. కోలీవుడ్ కెప్టెన్ మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. విజయ్‌కాంత్ మృతి పై యావత్ సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి చెందారు. విజయ్‌కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
తమిళనాడులో డిమోక్రటిక్ పార్టీ ప్రారంభించిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు విజయ్‌కాంత్. ఆ తర్వాత ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. 2016లో కిడ్నీ శస్త్ర చికిత్స అనంతరం విజయ్‌కాంత్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ సమస్యతో మాట్లాడలేకపోయాడు. అనారోగ్య సమస్యలు మరింత వేధించడంతో అటు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీ సమావేశాలను ఆయన సతీమణి దగ్గరుండి చూసుకున్నారు. విజయ్‌కాంత్ మృతి పట్ల సినీ, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్‌కాంత్ సినిమాల నిధి అని పిలుస్తుంటారు.
ఇప్పటివరకు తమిళంలో అనేకమంది హీరోలు ఉన్నారు. వీరంతా తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు. కానీ కెప్టెన్ విజయకాంత్ తన సినీ కెరీర్ మొత్తంలో తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ అయ్యాయి. కానీ ఆయన మాత్రం మరో భాష చిత్రాల్లో నటించలేదు. అప్పట్లో ఆయనకు ఇతర భాషల నుంచి అనేక ఆఫర్స్ వచ్చినప్పటికీ సున్నితంగా వాటిని తిరస్కరించారట. అందుకే ఆయనను తమిళ సినిమా నిధి అని పిలుస్తుంటారు. తమిళ సినిమాకు ఎన్నో మేలు చేసిన విజయకాంత్ మృతి చెందడంతో తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో మార్నింగ్ షోను రద్దు చేశారు. విజయకాంత్ మృతికి నివాళిగా మార్నింగ్ షోలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
GREAT MAN , HEART OF GOLD , we all will miss u sir pic.twitter.com/5yty8qBtn9
— Prabhudheva (@PDdancing) December 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.