Prema Kavali Movie: ‘ప్రేమ కావాలి’ హీరోయిన్ గుర్తుందా.. ? అందాలతో నెట్టింట గత్తరలేపుతోన్న ఇషా..

|

Aug 29, 2024 | 8:57 AM

ఫస్ట్ మూవీతో హిట్ అందుకున్న ఆది.. అటు నటనపరంగానూ ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన నటించింది ఇషా చావ్లా. ఈ మూవీతోనే కథానాయికగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Prema Kavali Movie: ప్రేమ కావాలి హీరోయిన్ గుర్తుందా.. ? అందాలతో నెట్టింట గత్తరలేపుతోన్న ఇషా..
Prema Kavali Movie
Follow us on

2011లో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ప్రేమ కావాలి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతో హిట్ అందుకున్న ఆది.. అటు నటనపరంగానూ ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన నటించింది ఇషా చావ్లా. ఈ మూవీతోనే కథానాయికగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్‏లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మొత్తం ఐదు తెలుగు సినిమాలు.. ఒక కన్నడ సినిమాలో అలరించింది. అయితే ప్రేమ కావాలి తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిరు, డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న విశ్వంభర చిత్రంలో ఇషా చావ్లా నటిస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, త్రిష, సురభి నటిస్తుండగా.. ఇషా స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. పదేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇషా చావ్లా..ఢిల్లీ బ్యూటీ. చదువు పూర్తైన వెంటనే యాక్టింగ్ కోర్స్ తీసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ ప్రయత్నించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.