అమ్మ ఒడిలో ఉన్న ఈ పుత్తడిబొమ్మ ఎవరో గుర్తుపట్టారా.? పోలికలో అచ్చం తల్లిలానే

|

Dec 31, 2024 | 12:55 PM

సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూహీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసంకొంతమంది పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు.

అమ్మ ఒడిలో ఉన్న ఈ పుత్తడిబొమ్మ ఎవరో గుర్తుపట్టారా.? పోలికలో అచ్చం తల్లిలానే
Actress
Follow us on

హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. తమ ఆరాధ్య దైవంగా భావించే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అన్ని నెట్టింట వదులుతుంటారు. ఈ క్రమంలోనే ఓ హాట్ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తారసపడింది. పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా చూశారా.? అమ్మతో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేసింది తక్కువే.. కానీ అన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే సంపాదించుకుంది.

అటు హిందీ.. ఇటు తెలుగు భాషలతో పాటు తమిళం, మలయాళం భాషల్లో తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఈ కుర్రబ్యూటీ. ప్రస్తుతం కుర్రాళ్ళకు ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.

‘సమ్మోహనం’ చేసే అందంతో తెలుగు ప్రేక్షకులను తొలిసారిగా పలకరించింది.. కుర్రాళ్లను ‘అంతరిక్షం’లోకి వెళ్ళేలా చేసింది. ఆ తర్వాత ‘వి’ అంటూ తన నటనలో వైవిధ్యాన్ని చూపించి.. ‘మహా సముద్రం’లాంటి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘హే సినామికా’ అంటూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికే ఆమెవరో మీకు అర్ధమై ఉంటుంది. ఆమె అదితి రావు హైదరి. 2006లో మలయాళంలో విడుదలైన ‘ప్రజాపతి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి రావు హైదరీ.. ఆ తర్వాత ‘శ్రీనగరం’ మూవీతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ‘ఢిల్లీ 6’ సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. అనంతరం బీ-టౌన్‌లో అదితికి వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి. అందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కూడా సాధించాయి. ఇక 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైదరీ.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.