Rajinikanth: అతనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు..! రజినీకాంత్‌తో ఉన్నది ఎవరో కనిపెట్టరా..!
జైలర్ సినిమా సక్సెస్ తర్వాత రీసెంట్ గా వెట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీకాంత్. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస విజయాలతో రోజు మీదున్నారు. సూపర్ స్టార్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జైలర్ సినిమా సక్సెస్ తర్వాత రీసెంట్ గా వెట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీకాంత్. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రజిని పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. వయసు పెరుగుతున్న సూపర్ స్టార్ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ సినిమాలతో పాటు ఇప్పుడు లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమ చేస్తున్నారు రజిని కాంత్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది నటీ నటులతో కలిసి పని చేశారు. అలాగే ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గానూ మారిపోయారు. ఇక పై ఫొటోలో సూపర్ స్టార్ తో ఉన్న చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా.? అతను ఇప్పుడు ఓ స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు. దేశవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు అతనంటే పడి చచ్చిపోతారు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!
పై ఫొటోలో రజినీకాంత్ తో ఉన్న చిన్నోడు ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్. భగవాన్ దాదా అనే సినిమాలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ చిత్రం లో రజినీకాంత్ తో కలిసి ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇక రజినీకాంత్ ఆయన లైనప్ చేసిన సినిమాలతో బిజీగా ఉంటే.. హృతిక్ వార్ 2 సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇక రజినీకాంత్ తో నటించడం పై గతంలో హృతిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ
View this post on Instagram