
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. మొదటి సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సీరియల్లో మాటలు రానీ అమాయకమైన అమ్మాయిగా కనిపించి.. తన నటనతో ఆకట్టుకుంది. అప్పట్లో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి మెప్పించింది. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది. సీరియల్స్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లడంతో ఆమె క్రేజ్ మరో స్థాయికి చేరింది. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక.. ఈ షో తర్వాత సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసింది.
ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే తన ప్రియుడు శివకుమార్ తో కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టా్ర్ట్ చేసిన ఆమె..తన పర్సనల్ విషయాలు సైతం పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసింది. అందులో ప్రియాంక లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. టీనేజ్ లో చాలా సన్నగా.. చిన్న అమ్మాయిగా కనిపిస్తుంది ప్రియాంక. ప్రస్తుతం ఆ ఫోటో చూస్తుంటే.. చిన్న వయసులోనే ప్రియాంక మోడలింగ్ స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియాంక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. అలాగే ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. మరోవైపు కవర్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్ సిరీస్ చేసి ఓటీటీ సినీప్రియులకు దగ్గరైంది. ఇటీవల నయనం వెబ్ సిరీస్ ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..