
ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి సామాన్యుల మొదలు సెలబ్రిటీల దాక అందరూ సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. తాము చేసిన ప్రతీ పని గురించి పోస్ట్ చేస్తూ.. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడూ తమ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు. అంతేకాదు అప్పుడప్పుడూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారు. ఇదిలా ఉంటే.. ఫ్యాన్స్ తమకిష్టమైన హీరోయిన్ ఫోటోలు ఏది నెట్టింట కనిపించినా.. వాటిని పదిలంగా దాచుకుంటారు. తాజాగా పలువురు స్టార్ హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? మన తెలుగమ్మాయే. కెరీర్‌లో ఎక్కువ హిట్స్ లేకపోయినప్పటికీ.. ఈ భామ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులకు చేరువైంది. ‘భలే మంచి చౌక బేరం’, ‘నర్తనశాల’ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతోంది. ఆమెవరో కాదు ‘యామిని భాస్కర్’. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.