
సాధారణంగా సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటుంది. ముఖ్యంగా తారల చిన్ననాటి ఫోటోస్,వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ధనుష్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఆమె సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ధనుష్ హీరోగా పరిచయమైన సినిమాలో ఆమె కథానాయిక. అప్పటికే ఆమె రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం విశేషం. ధనుష్ సినిమా కంటే ముందు కన్నడలో రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత ధనుష్ తో కలిసి తమిళంలోకి అరంగేట్రం చేసింది. ఆమె పేరు షెరీన్ శ్రీనగర్.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో 2002వ సంవత్సరంలో తీసింది. ధనుష్ హీరోగా పరిచయమైన సినిమా తుల్లువదోల్లమయి. కస్తూరి రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామకృష్ణన్ నిర్మించారు. బెంగుళూరుకు చెందిన షెరీన్.. అప్పటికే కన్నడలో పోలీస్ డాగ్, ధృవ సినిమాల్లో నటించింది. మొదటి రెండు సినిమాలతోనే నటిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ధనుష్ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
తుల్లువదోల్లమయి సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో ఇద్దరు టీనేజ్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోట సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా జూనియర్స్ పేరుతో రీమేక్ చేశారు. ఇదే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది షెరీన్. ఆ తర్వాత తెలుగులో డేంజర్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..