Devi Putrudu: దేవుడా.? దేవిపుత్రుడు చిన్నారి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటీ.!

కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దేవీ పుత్రుడు సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

Devi Putrudu: దేవుడా.? దేవిపుత్రుడు చిన్నారి ఇప్పుడు ఇలా మారిపోయిందేంటీ.!
Devi Putrudu

Updated on: Feb 16, 2024 | 7:22 PM

విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు విక్టరీ వెంకటేష్. అలా ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. వాటిలో దేవిపుత్రుడు సినిమా ఒకటి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దేవీ పుత్రుడు సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నది గుర్తుందా.?

వెంకటేష్ తో కలిసి ఓ పాటల్లోనూ కనిపించింది ఆ చిన్నారి. ఈ చిన్నారి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారి పేరు వేగా తమోటియా. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వేగా.. నిర్మాతగానూ చేసింది.   ఆమె తమిళం, హిందీ అలాగే తెలుగు చిత్రాలలో నటించింది.. ఆమె బహుశా అదే పేరుతో ఉన్న చిత్రంలో సరోజగా మరియు పసంగలో సోబికన్నగా ఆమె నటనకు బాగా పేరు తెచ్చుకుంది.

ఈ చిన్నది తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత దడపా దడపా సినిమాలు చేస్తుంది . కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందా అని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. వేగా చివరిగా మెట్రో పార్క్ సినిమాలో కనిపించింది.

Vega Tamotia

వేగా తీమోతియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

వేగా తీమోతియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి