Tollywood: సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి.. ఇప్పుడు తోపు..

సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారి చిన్నప్పటి ఫోటోలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఓ పిక్ తెచ్చాం. ఇందులో ఉంది ఎవరో మీరు కనిపెట్టండి...

Tollywood: సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి.. ఇప్పుడు తోపు..
Actor Childhood Photo
Follow us

|

Updated on: Jun 23, 2024 | 7:16 PM

తన అభిమాన స్టార్స్.. చిన్నప్పటి అరుదైన ఫోటోలు కోసం తెగ ఆరాటపడుతుంటారు ఫ్యాన్స్. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైక్స్, షేర్స్ వస్తుంటే మురిసిపోతుంటారు. అందుకే ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్, స్నాప్ చాట్.. ఇలా అన్ని చోట్లు హీరో, హీరోయిన్ల లేటెస్ట్ ఫోటోలు.. వారి చిన్నప్పటి అరుదైన ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మీ ముందుకు ఓ యాక్టర్ చిన్ననాటి ఫోటోను తీసుకొచ్చాం. ఇతను బుల్లితెరపై సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తుంటారు ఫ్యాన్స్. వెండితెరపై కూడా హీరోగా నిలదొక్కుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఇతని కామెడీ టైమింగ్‌ను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఏంటి ఏమైనా గెస్ చేశారా..? లేదా ఓ క్లూ ఇస్తున్నాం. ఇతగాడు మెజీషియన్‌గా తన కెరీర్ ఆరంభించాడు. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు.

కనిపెడితే ఫైన్.. ఇప్పటికీ గుర్తించనివారి కోసం మేమే చెప్పేస్తున్నాం. ఆ ఫోటోలో ఉన్న బుడ్డోడు.. సుడిగాలి సుధీర్. అతను కెరీర్‌ను చాలా అందంగా మలుచుకున్నాడు. తొలుత చిన్న చిన్న మ్యాజిక్కులు చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేవాడు. ఆ తర్వాత జబర్దస్త్‌కి వచ్చాక అతని జీవతం మారిపోయింది. బుల్లితెరపై టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. యాంకర్‌గానూ కొన్ని షోలలో సత్తా చాటాడు. సుధీర్, రష్మీ జోడికి.. విపరీతమైన క్రేజ్ వచ్చింది. వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి చిన్నా చితక క్యారెక్టర్స్ చేసిన సుధీర్.. ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడు’, ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్త్ర’ సినిమాలు చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో సుధీర్ సరసన దివ్య భారతి నటిస్తోంది. G.O.A.Tతో తన ఫేట్ మారుతుందని సుధీర్ బలంగా నమ్ముతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే
సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..