తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా సంచలనం సృష్టించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో కనిపించిన ఆ చిన్నారి.. ఆ తర్వాత కథానాయికగా స్టార్ హీరోస్ సినిమాల్లో మెరిసింది. కంటెంట్ ప్రాధాన్యత బట్టి సెకండ్ హీరోయిన్.. విలనిజం పాత్రలు కూడా చేసింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి..అప్పట్లో ఓ తరం మొత్తాన్ని ఊపేసింది. వెండితెరపై టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార.. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ..? తనే హీరోయిన్ రాశీ. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ తరం హీరోలతో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కెరీర్ తొలినాళ్లలో గోకులంలో సీత సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది.
చెన్నైకి చెందిన సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో జన్మించింది రాశీ. ఆమె తండ్రి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత డ్యాన్సర్ గా మారారు. చిన్నవయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రాశీ.. హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంది. ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసిన రాశీ.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకే టైమ్ కేటాయించింది. పవర్ స్టార్ జోడిగా గోకులం సీత సినిమా తర్వాత జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇమేజ్ సొంతం చేసుకుంది. పెళ్లి పందిరి, మనసిచ్చిచూడు, స్వప్నలోకం, ప్రేయసి రావే వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న రాశీ.. ఎంతో మంది శ్రీమంతుల సంబంధాలు వదలుకుని ప్రేమించిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న రాశి.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. కానీ ఆ చిత్రాలు అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇటీవలే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా బుల్లితెరపై మరోసారి అలరించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.