AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

చిన్నారి పెళ్లి కూతురు గెటప్‏లో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? హీరోయిన్.. కానీ అంతగా ప్రేక్షకులకు పరిచయం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలను పక్కనపెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2024 | 3:18 PM

Share

సాఫ్ట్ వేర్ అమ్మాయి.. అయినా నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. తొలి మూవీతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. అలాగే ఓ యంగ్ హీరోను ప్రేమించి ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా.. ? తన మొదటి సినిమాలో హీరోగా నటించిన అబ్బాయితోనే ప్రేమలో పడింది. ఐదేళ్లుగా తమ ప్రేమ విషయాన్ని రహస్యంగానే పెట్టి.. ఇటీవలే గ్రాండ్ గా వివాహం చేసుకుంది. తను ఎవరో కాదండి.. హీరోయిన్ రహస్య గోరఖ్. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సతీమణి. ఈ ఏడాది ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది.

కిరణ్ అబ్బవరం ఇటీవలే క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న కిరణ్.. క మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు అడియన్స్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రహస్య గోరఖ్. “మా ఆయన కోసం ఈ సినిమా చూడండి” అంటూ ఎంతో క్యూట్ గా రిక్వెస్ట్ చేసింది. ఇక రహస్యకు సంబంధించిన ఆ వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది.

రహస్య, కిరణ్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. కానీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కిరణ్, రహస్య జోడిగా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..