
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వారణాసి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ లుక్, సినిమా టీజర్ ను విడుదల చేశారు. టైటిల్ టీజర్ తోనే సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేశాడు జక్కన్న. ముఖ్యంగా మహేష్ బాబు లుక్, గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ.. అబ్బో మెంటలెక్కిపోయారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ సినిమాను రీ రిలీజ్ చేశారు. మహేష్ బాబు, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా మహేష్ బాబు యాక్టింగ్, డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. కాగా రీ రిలీజ్ లోనూ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో కొంతమంది మహేష్ అభిమానులు అత్యుత్సహం చూపించారు.
మహేష్ బాబు వారాణసి మూవీ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు. జై బాబు.. నినాదాలతో హోరెత్తించారు. ఇంతవరకూ బాగానే ఉంది.. కానీ కొందరు అభిమానులు మహేష్ ఫోటోలకు రక్తంతో బొట్టుపెట్టడంలాంటివి చేశారు. ఓ అభిమాని ఏకంగా తల పై బీరు సీసా పగలగొట్టుకొని ఆ నెత్తరుతో మహేష్ ఫోటోలు బొట్టు పెట్టాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్, మహేష్ బాబు అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి