AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ తినే ఫుడ్ చూసి షాక్.. ప్రతిరోజు అవే తినేవాడట.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫుల్ మాస్ హీరోగా చూపించిన దర్శకుడు పూరిజగన్నాథ్ . పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సినిమా బుజ్జిగాడు.

Prabhas: ప్రభాస్ తినే ఫుడ్ చూసి షాక్.. ప్రతిరోజు అవే తినేవాడట..  ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్..
Sanjana
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2021 | 3:11 PM

Share

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌‌‌‌‌‌ను ఫుల్ మాస్ హీరోగా చూపించిన దర్శకుడు పూరిజగన్నాథ్ . పూరిజగన్నాథ్ డైరెక్షన్‌‌‌లో ప్రభాస్ నటించిన సినిమా బుజ్జిగాడు. ఈ సినిమాతో మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్‌‌‌గా ఉంటాయి. బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరీర్‌‌‌లో ఓ మంచి హిట్ గా నిలిచింది.  ఈ సినిమాలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్‌‌‌‌తో కనిపించి ఆకట్టుకున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ఫుడ్ విషయంలో రాజీపడడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడట. బుజ్జిగాడు కోసం భారీ వర్కవుట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ లోకి మారిపోయాడు. ఇక అలాగే ఈ  సినిమాలో హీరోయిన్‌‌‌గా చైన్నై చిన్నది త్రిష నటించిన విషయం తెలిసిందే. అలాగే సెకండ్ హీరోయిన్‌‌‌గా కన్నడ నటి సంజన గాల్రానీ యాక్ట్ చేసింది.

తాజాగా ఈ సినిమాలో నటించిన సంజన ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రభాస్‌‌‌‌లాంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు.. ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఆయన ఫిజిక్ చూస్తే అర్థం అవుతుంది ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా కష్టపడతాడు. అంత కష్టపడే వ్యక్తి ఏ రాయల్ ఫ్యామిలీలో దొరకడు. ‘బుజ్జిగాడు’ సినిమాలో చాలా సన్నగా కనిపిస్తారు ప్రభాస్. దీని కోసం ఆయన ప్రతిరోజు కేవలం పెసరట్టు మాత్రమే తినేవాడు” అని చెప్పుకొచ్చింది సంజన.

Prabhas

 మరిన్ని ఇక్కడ చదవండి : 

చదివిన స్కూల్‌కు మరిచిపోని మేలు చేసిన సుకుమార్‌..!తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి గురి..:Director Sukumar Video.

Akkineni Nagarjuna: ‘బంగార్రాజు’ పక్కన సత్యభామ మాటేంటి..? రమ్యక్రిష్ణ ఆన్‌ బోర్డేనా…?

Shalini Pandey- Ritika Singh: కారులో షికారుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్న క్యూట్ హీరోయిన్స్.. మాములు రచ్చకాదుగా..