
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీల సంబంధిచిన చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. వారి ఫోటోలు పెట్టినా, ఏదైనా పోస్ట్ చేసినా.. తమ మూవీ అప్ డేట్స్ పంచుకున్నా ట్రెండ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు సైతం ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. ప్రజంట్ మీ ముందుకు ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోను తీసుకొచ్చాం. తనెవరో మీరు కనిపెట్టగలరా..? తను అందంలో హైలెట్.. అభినయంలో ఎవరెస్ట్. మోడ్రన్ అమ్మాయిగా అదరగొడుతుంది. పల్లెటూరి పిల్ల పాత్రల్లో కూడా వావ్ అనిపిస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది.
ఏంటి ఏమైనా ఓ అంచనాకు వచ్చారా..? క్లూ కావాలా.? .. తను బాక్సర్ కూడా. ఇప్పుడు అన్నా ఐడియా వచ్చిందా..?. ఇంత చెప్పినా కనిపెట్టలేదంటే.. ఇక మేమే చెప్పేస్తాం లేండి. తను రితికా సింగ్. వెంకటేష్ గురూ సినిమాలో నటించింది. ముంబైలో పుట్టి పెరిగిన రితికా.. చిన్నప్పటి నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. తండ్రి శిక్షణలో ఆరితేరి సూపర్ ఫైట్ లీగ్ ఫస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసింది. ఇక దర్శకురాలు సుధా కొంగర తన సినిమా కోసం నిజమైన బాక్సర్‌ను వెతికే క్రమంలో రితిక తారసపడింది. అలా ఈమెతో సాలా ఖాదూస్ ఇరుది సుట్రూ సినిమా తీసింది. తమిళ్, హిందీలో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా విజయవంతమైంది. దీంతో బాక్సర్ కాస్తా హీరోయిన్ అయి సినిమాలు చేస్తుంది.
గురు తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా మాత్రమే చేసింది. ప్రజంట్ తమిళ్‌లో తలైవా రజినీకాంత్ వెట్టైయన్ సినిమాలో నటిస్తోంది. అందం, అభినయం ఉన్నా తెలుగులో ఈ అమ్మడు మంచి అవకాశాలు రావడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి