సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెప్పుకోకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కూడా కొంతమంది ప్రతిభ లేకుంటే ప్రేక్షకులు ఆదరించారు. చాలా మంది నటవారసులు సరైన హిట్ లేక చాలా కాలంగా సతమతం అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్ కానీ ఈ భామలు మాత్రం సరైన హిట్ లేదు. అందం ఎక్కువే,, ప్రతిభ కావాల్సినంత ఉంది.. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇంతకూ ఈ అక్క చెల్లెళ్ళు ఎవరు గుర్తుపట్టారా.?
టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించిన వారిలో రాజశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. రాజశేఖర్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించారు. ఇక స్టార్ హీరోగా రాణించిన రాజశేఖర్ 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నారు. జీవిత కూడా ఎన్నో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. వీరిలో శివాని, శివాత్మిక అనే కూతుర్లు ఉన్నారు. ఈ ఇద్దరు భామలు కూడా హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు.
ఇక శివాని 2 స్టేట్స్ అనే సినిమాతో 2018లో అడుగు పెట్టింది. అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్, కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలు చేసింది ఈ అమ్మడు. తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది ఈ వయ్యారి. అలాగే రాజ్ తరుణ్ తో కలిసి ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. అలాగే శివాని చెల్లెలు శివాత్మిక కూడా పలు చేసింది. ఈ అమ్మడు ముందుగా ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. ఆ తర్వాత హీరోయిన్ గా దొరసాని, పంచతంత్రం, ఆకాశం,రంగమార్తండ సినిమాలు చేసింది. ఆనందం విలైయాడుం వీడు అనే తమిళ్ సినిమా కూడా చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మలు ఇద్దరికీ సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. కానీ తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు ఈ ఇద్దరూ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.