Trisha : హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

హీరోయిన్ త్రిష.. దాదాపు 20 సంవత్సరాలుగా సినీ రంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా త్రిష వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.

Trisha : హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..
Trisha

Updated on: Apr 14, 2026 | 9:25 AM

హీరోయిన్ త్రిష ఇంటికి వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపింది. సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆ గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. త్రిష ఇంటికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిసేపట్లో బాంబు పేలుతుందని సదరు వ్యక్తి హెచ్చరించడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తేనాంపేట పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) , జాగిలాలతో త్రిష ఇంటికి చేరుకున్నారు. పోలీసు బృందాలు త్రిష నివాసంలోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. దాదాపు గంటల తరబడి సాగిన ఈ శోధనలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. చివరకు అది ఫేక్ బెదిరింపు (Hoax Call) అని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో త్రిష షూటింగ్ నిమిత్తం బయట ఉన్నారా లేదా ఇంట్లోనే ఉన్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా...

ఈ నకిలీ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి పనులు చేసేవారు మానసిక స్థితి సరిగా లేనివారైనా అయి ఉండాలి లేదా ఆకతాయిలైనా అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..

తమిళ సినీ రంగంలో అగ్ర నటుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ హీరోల నివాసాలకు కూడా ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా త్రిష ఇంటిని లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది. సెలబ్రిటీల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

Follow Us